కరీంనగర్ జిల్లా : ది రిపోర్టర్ టీవీ : కరీంనగర్ పట్టణంలోని త్రీ టౌన్ నూతన ఎస్సైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిడాల సురేందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు, కేశవపట్నం మండలం నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
