- నీళ్లివ్వకుండా రైతులను బలిచేయొద్దు
- కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
- చీమలకుంటపల్లి గ్రామలో ఎండిన పంటల పరిశీలన
- మిడ్ మానేరు (రాజరాజేశ్వర) ప్రాజెక్టులోకి నీళ్లు ఎత్తిపోసి పంట పొలాలకు కాల్వల ద్వారా సాగునీళ్లు ఇవ్వాలి
- సాగునీళ్లు లేక రైతులు సాగు చేసిన పంటలన్ని ఎండుతున్నాయి
- ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దు
కరీంనగర్ జిల్లా: మేడిగడ్డ వద్ద గోదావరినదిలో 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రం లోకి పోతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను బలిచేయొద్దని … కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామంలో ఎండిన పంటలు, నీళ్లు లేక నెర్రెలు భారిన చెరువు, సాగునీటి కాల్వ ను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినాయనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు లను ఎండబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. యాసంగి పంటలకు సాగునీళ్లు అందకపోవడంతో పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతులు గుండెలు పగిలేలా కన్నీరు పెడుతున్నారని.పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి మట్టిపాలు అవుతుందన్నారు. మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో 5000ల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం లోకి పోతున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. మేడిగడ్డ దగ్గర గోదావరి నదిపై కాఫర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే నీళ్లను అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి మిడ్ మానేరు లోకి నీళ్లను ఎత్తిపోయడంతో పాటు కాల్వల ద్వారా యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సాగునీళ్లు ఇవ్వడం జరిగిందని… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగా చెరువులు ఎండిపోవడంతో పాటు …సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రాబోయే 15 రోజుల్లో ఎండల తీవ్రత కారణంగా పొలాలు ఇంకా ఎక్కువ శాతం ఎండిపోయే పరిస్థితి ఉందని… మూగ జీవాలకు త్రాగు నీళ్లు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతులు రోధిస్తున్నారని…. ప్రభుత్వం స్పందించి సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎలుక దేవయ్య, దీటి రాజు, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, సాయి, తదితరులు ఉన్నారు