హైదరాబాద్ : అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఓ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి 42 మంది మహిళలు సహా 140 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. అశ్లీల నృత్య ప్రదర్శనలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు చేశారు.
పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకులను ఆకర్షించి సొమ్ము చేసుకునేందుకకు వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను పబ్‌కు రప్పించినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










