తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో టపాసుల దుకాణదారులు పెట్టుకోవడానికి తప్పనిసరిగా ఫైర్ సర్వీస్ అధికారి వద్ద లైసెన్స్ తీసుకోని నిర్వహించాలని పాకాల అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి గుణశేఖర్ రెడ్డి మాట్లాడుతూ లైసెన్స్ తీసుకోకుండా టపాసులు అమ్మిన, షాపులు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా టపాసు దుకాణాలు పెట్టాలంటే ప్రతి ఒక్కరూ ముందస్తుగా లైసెన్స్ తీసుకొని నిర్వహించాలని కోరారు.
