రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ వి. దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గుడివాడ రెండో పట్టణ సీఐగా దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్న ప్పుడు 2022లో భూ వివాదంపై ఫిర్యాదు అందగా, రెండు వర్గాలకు సంబంధించి రూ.30 లక్షలకు వివాదాన్ని పరిష్కరించారు.
ఈ సమయంలో సొమ్ము ఇచ్చినవారికి అనుకూలంగా ఉండి ఫిర్యాదుదారు నుంచి కొన్ని డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని, వ్యతిరేక వర్గానికి ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లు వెనక్కి ఇప్పించాలని ఫిర్యాదుదారు సీఐని కోరగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం, దర్యాప్తులో నేరం తేలడంతో సీఐని సస్పెండ్ చేసినట్లు సమాచారం.