contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

క్షేత్రస్థాయిలో MSME సర్వేను పరిశీలించిన ఎంపీడీవో

విజయనగరం జిల్లా :బాడంగి మండలంలో మండల ఆఫీస్ నవంబర్ 29 నుండి నిర్వహిస్తున్నటువంటి MSME సర్వే ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఎం.ఎస్.ఎం.ఈ అంటే.. మధ్యతర ,చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల సర్వే. ఈ సర్వే యొక్క లక్ష్యాలు 1) రాష్ట్రంలో అన్ని ల డేటా బేస్ అభివృద్ధి చేయటం, 2)వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, 3) మహిళలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నైపుణ్యాల అభివృద్ధి ఇతర సేవలను నేర్పించడం, 4) ఆర్ఏఎంపి(ర్యాంప్) ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని ఎం ఎస్ ఎం ఈ లకు అవగాహన కల్పించి వాటి సామర్థ్యాన్ని పెంచే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం,  5)అలాగే రాష్ట్రంలో బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ను తయారు చేయడం. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో పాటుగా అందరు సహాయకులు ఈ సర్వేలను నిర్వహించడం జరుగుతుంది.  ఈ సర్వేలో ఈరోజు భీమవరం ముగడ, మరియు బాడంగి హెడ్ క్వార్టర్స్ లో ఈ ఓ ఆర్ డి తో పాటుగా MPDO పరిశీలించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సర్వేలో దాదాపుగా చిన్న చిన్న షాప్స్ అన్ని కూడా సర్వే డేటాను ఎంట్రీ చేయడం జరిగింది. వ్యాపారస్తులందరిని ఈ సర్వే కి సహకరించాలని  కోరారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :