- హత్య కేసులో జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు
ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చెదుల రాజేందర్ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి కాస సంజీవ్ కి మద్యలో వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి తగదలు జరుగుతుండేవి. రోజున పొలంలో పనిచేస్తు ఒంటరిగా ఉన్న రాజేందర్ ను గమనించిన కాస సంజీవ్ మరో నిందితుడైన గోదురు గ్రామానికి చెందినా తైదపల్లి రజినీకాంత్ తో కలిసి తమ వెంట తెచ్చుకున్న కత్తితో రాజేందర్ మెడ పై, కడుపులో,కుడి చేతి పై నరికారు. తీవ్ర గాయాలైన రాజేందర్ అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఇద్దరు నిందితులు రాయికల్ మం. భూపతిపూర్ క్రమానికి చెందినా మూడవ నిందితుడు మంగలారపు లక్ష్మీనారాయణ తో కలిసి కేసు కు సంబందిచిన సాక్ష్యదారాలను నాశనం చేసినారు. మృతుని బార్య లత ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిదితులు అయిన కాస సంజీవ్, తైదపల్లి రజినీకాంత్, మంగలారపు లక్ష్మీనారాయణ లను కోర్టులో హాజరు పరిచారు. కేస్ ను విచారించిన న్యాయమూర్తి శ్రీ నారాయణ నిదితులు అయిన కాస సంజీవ్, తాడిపల్లి రజినీకాంత్ లకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి 10000 జరిమానా, మంగలారపు లక్ష్మీనారాయణ కు 5 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 5000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ సందర్బంగా ఎస్పి గారు మాట్లాడుతూ … సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.