హైదరాబాద్ : మీ మీద కేసు నమోదు అయింది. మిమ్మలను అరెస్ట్ చేస్తున్నాం. ఎక్కడున్నావో చెప్పు అంటూ ఓ వ్యక్తికీ రకరకాలుగా బెదిరించారు. ఈ రకమైన బెదిరింపులకు దిగడం ఫేక్ పోలీసులకు పరిపాటి అయిపోయింది. నిజంగా పోలీసులు కూడా కాసుల కోసం ఇటువంటి కాల్స్ చేసి బెదిరిస్తున్నారా ! లేక ఫేక్ పోలీసుల ! అనేది ప్రజలలలో అయోమయాన్ని తలపిస్తుంది. పోలీసులమని చెప్పుకోవడం బెదిరించడం … నీ అంతు చేస్తామనడం… కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం… లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తా .. అని బెదిరించడం .. పలు అనుమానాలకు తావిస్తుంది. తిరిగి మరల సెక్స్ మాఫియా గ్యాంగులు మార్కెట్ లోకి వస్తున్నట్టు సమాచారం. బెదిరింపులకు పాలుపడుతున్న ఫోన్ నంబర్లు .. 9182365921 / 9640655551 ఇంకా పలు రకాలైన ఫోన్ నంబర్లు వాడుతున్నట్టు సమాచారం.