విజయనగరం : బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం మండలంలో లింగాపురం నుండి అంట్లవార గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా ఎమ్మెల్యే రంగారావు (బేబీ నాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మి నాయుడు విచ్చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ, “ఈ రహదారి నిర్మాణానికి రూ. 2.4 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకట్ నాయుడు, ఎంపీపీ మరియు ZPTC ప్రతినిధి శ్రీ నర్సుపల్లి వెంకటేష్, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు.