తిరుపతి జిల్లా : ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (జూన్ 12) ను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వివిధ బాలల సంఘాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పేడు మండలంలోని పంగురు, చిందేపల్లి, అంజిమేడు గ్రామాల్లో బాలల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల కోఆర్డినేటర్ శ్రీమతి శిరీష మాట్లాడుతూ, “బాలలను పనిలోకి దించటం అంటే వారి హక్కులను హరించటమే. ఇది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన వ్యవహారం,” అని పేర్కొన్నారు.
అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బాల కార్మిక వ్యవస్థపై వక్తృత్వ పోటీలు నిర్వహించబడగా, పిల్లలందరినీ బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. అలాగే బండారుపల్లి గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి ఒక భారీ ర్యాలీ నిర్వహించి, బాల కార్మికత్వానికి వ్యతిరేకంగా సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి సిబ్బందితో పాటు మండల కోఆర్డినేటర్ శిరీష, వెంకటేష్, మురుగయ్య, సచివాలయ సిబ్బంది, సీబీఐ నెంబర్లు, ఏస్సివి లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో బాలల హక్కులపై అవగాహన పెంపొందించి, బాల కార్మిక వ్యవస్థ అంతమవ్వడానికి దోహదపడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.