తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వ,విఖ్యాత నటసార్వభౌములు,ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఓ కారు ఢీ కొనడంతో విగ్రహం క్రింది భాగం బేస్ మట్టం పాక్షికంగా ధ్వంసమయింది. ఈ విగ్రహం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిక గ్రామంలో జాతీయ రహదారి ఫై నిర్మించి ఉంది. ఇకనైనా పార్టీ ఉన్నత నాయకులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.
