- ఈనెల 25వతేది చలో నెల్లూరు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ధర్నా.
గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల కార్యదర్శి బత్తల రత్తయ్య,మండల గ్రామ రెవెన్యూ సహాయకులు కార్యదర్శి ఓబులేసు ఆధ్వర్యంలో మర్రిపాడు మండల విఆర్ఎ లు కలిసి స్థానిక తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ చలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలియజేసారు.రెవెన్యూ వ్యవస్థలో గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నవారు డిపార్ట్‌మెంట్ లో దిగువ స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉన్నామని, డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నామన్నారు. గ్రామాల్లో నివసిస్తూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలం నుండి చాలా తక్కువ వేతనంలో పనిచేస్తున్నామన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులు పార్ట్ టైం ఉద్యోగులు అయినా, రాత్రి, వగలు తేడా లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వీజరీలకు – తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదన్నారు. వేతనం పెంచకపోగా డిఎని కూడా ఉపసంహరించి రికవరీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా జీతాలు పెరుగుతాయని ప్రమోషన్లు అమలు చేస్తారని విఆర్పిలు అశించామన్నారు. కానీ గడిచిన 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వి ఆర్ ఏ ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదన్నారు. నిబంధనకు విరుద్ధంగా నైట్ వాచ్మెన్, అటెండర్ డ్యూటీలు చేస్తున్నారు. ఇదే గాక రీ సర్వే పేరుతో మైళ్ళకొద్ది దూరం ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేయాల్సి వస్తుందన్నారు. అదనపు పని భారం పెంచినందుకు అవసరమైన టి ఏ డి ఏ లు గురించి పట్టించుకోలేదన్నారు. అదనపు పనిభారానికి ఆర్థిక సమస్యలు కూడా తోడవడంతో వీ అర్ ఏ ల కుటుంబాలు పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పే స్కేలు జీవితాలు ఇవ్వాలని మంత్రులు, అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ కనికరించడం లేదన్నారు. చదువుకున్న వి ఆర్ ఏ లు ఎప్పటికైనా వీఆర్వో ప్రమోషన్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మాత్రం ప్రమోషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రమోషన్ కొరకు ఎదురుచూస్తున్న వీఆర్‌ఎలకు వయోభారం పెరుగుతుందన్నారు. దలిత, గిరిజన మైనార్టీ ఐడుగు బలహీన వర్గాల కు చెందిన వి ఆర్ ఏ ల కుటుంబాలను ఆకలి బాధల నుండి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అక్రమ డ్యూటీలు రద్దు చేసి వాచమన్లు, అటిండర్లు ఎక్కడైతే అవసరమో అక్కడ సీనియార్టీ ఉన్నటువంటి వీ అర్ ఏ లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరుతున్నామన్నారు. కనుక గ్రామ రెవెన్యూ సహాయకులు పట్ల సానుభూతితో వ్యవహరించి మా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలనీ, అర్హులైన వీఆర్వోలకు ప్రమోషన్లు ఇవ్వాలనీ, ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా నియమించాలనీ, అటెండర్ నైట్ వాచ్మెన్ ప్రమోషన్ కోటాను 20 నుండి 70 శాతం పెంచాలనీ, అక్రమ డ్యూటీలు రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.