అల్లూరి జిల్లా : కొట్నపల్లి నల్ల రాయి క్వారీ లో బాంబు పేలుళ్లు ఆగడం లేదు, ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల క్వారీలు ఉన్నపటికీ చుట్టూ పక్క గ్రామాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్వారీలు నడుపుతున్నారు. కొట్నపల్లి నల్ల రాయి క్వారీ మాత్రం నిబంధనలు పాటించకుండా పేలుళ్లు జరుపుతున్నారు.దీనివల్ల ఇళ్లు, పంటలకు నష్టం వాటిల్లుతోంది, గాలి కాలుష్యమవుతోంది, గిరిజన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. క్వారీలలో పేలుళ్లకు సంబంధించిన నిబంధనలను క్వారీ యజమానులు పాటించడం లేదు. అనుమతి లేకుండానే ఇంత భారీ పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. క్వారీ పేలుళ్ల కారణంగా ఇళ్లు దెబ్బతింటున్నాయి, పంటలు నాశనమవుతున్నాయి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోంది, ముఖ్యంగా పిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పేలుళ్ల వల్ల వచ్చే ధూళి, శబ్దాలు గాలిని కలుషితం చేస్తున్నాయి, ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం,గ్రామస్తులు క్వారీ పేలుళ్లకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారు, దీనివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజన ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే క్వారీ యజమానులకు మద్దదు గా ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
