కరీంనగర్ జిల్లా: అనారోగ్య సమస్యల కారణంగా మంచానికే పరిమితమైన గన్నేవరం మండల పారువెళ్ల గ్రామానికి చెందిన యాళ్ల స్వామిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రెండు బిల్లులకు గాను లక్షా 30వేల రూపాయలు మంజూరు కాగా, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆ రెండు చెక్కులను అందజేశారు. గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మందికి 16,29,500 రూపాయలు మంజూరు కాగా, వాటిని గురువారం గన్నేరువరం రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయన చెక్కుల రూపంలో అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తున్నపుడు యాళ్ల స్వామిరెడ్డి చెక్కుల కోసం రాలేకపోవడానికి గల కారణాలు తెలుసుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి అక్కడి నుంచి నేరుగా పారువెళ్ల లోని యాళ్ల స్వామిరెడ్డి ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎప్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో కొందరు అక్కసుతో పనిగట్టుకొని దుష్ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. ఈ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. చెక్కుల పంపిణీలో పారదర్శకత పాటిస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో మాదిరిగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం నిరీక్షించాల్సిన పని లేదని, దరఖాస్తు చేసుకున్న తక్కవ సమయంలోనే ఆర్థిక సహాయాలు మంజూరవుతున్నాయని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు సంచాలకుడు శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి కిర్మణయి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి ,పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మాతంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు.