జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణ అమ్మక పెట్ శివారులోని అక్కడ రైల్వే గేటు పడితే సుమారు గంట ఆగాల్సిందే. అత్యవసరంగా వెళ్లే వాహనాలైనా గేటు తీసేవరకూ నిరీక్షించాల్సిందే. ఎంత దూరం నుంచి వచ్చినా, పక్క ప్రాంతం నుంచి వచ్చినా వాహనాలకు బ్రేక్ వేయాల్సిందే. అమ్మక పెట్ రైల్వేగేటు వద్ద దశాబ్దాల కాలం నుంచి తిష్ఠవేసిన సమస్య ఇది. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి గానీ, ఫ్లైఓవర్ గానీ నిర్మించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న రైల్వే గేట్ వల్ల నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గంటల తరబడి వేచి చూడాల్సిన సమయం వస్తుందని తమ పనులకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు వాపోయారు.ఈ రహదారి జిల్లాలకు సైతం అనుసంధానం ఉండడంతో వాహనదారులు భార్యలు తీరాల్సిన పరిస్థితి నెలకొంది.బ్రిడ్జి నిర్మాణం చేపట్టమని అధికారులకు,రాజకీయ నాయకులకు విన్నవించినప్పటికీ ఎటువంటి నిర్మాణం జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్న వాహనాలు వెళ్లడానికి బై పాస్ ఉన్నప్పటికీని ఆ దారి వర్షాల వల్ల నిత్యం బురదమయంగా మారుతుందని అన్నారు. అందువలన బీట్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
1) అమ్మక పెట్ గ్రామం.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక పెట్ గ్రామ నివాసిని నా పేరు కొమ్ముల వెంకటేష్.మేము మెట్ పల్లి పట్టణానికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటానని అన్నారు. ఈ రైల్వే గేట్ వల్ల రైలు వచ్చే సమయానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడి పనులకు తీవ్ర అంతరాయం జరుగుతుందని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు,రాజకీయ నాయకులకు తెలిపినప్పటికీ ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణము చేపట్టకపోగా,తాత్కాలిక రహదారి పై బీటి రోడ్డు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2) ఇందిరమ్మ ఇండ్ల కాలనీ.
మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ఇందిరమ్మ ఇండ్ల కాలానికి చెందిన వ్యక్తిని. మాకు ఏ అవసరం ఉన్న నిత్యం మెట్ పల్లికి రావాల్సిన పరిస్థితి. ఈ రైల్వే గేటు వల్ల రైలు వచ్చే సమయానీకి సుమారు గంట ముందు గేటు వేయడంతో రైలు వెళ్లే వరకు వేచి చూడాల్సి వస్తుంది. అనేకమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి రాకపోకలను సుగమం చేయాలని కోరుతున్నామన్నారు.