పాకాల:తిరుపతి జిల్లా పాకాల మండలంలో గత మూడు నెలల నుంచి చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ సరఫరా లో కందిపప్పు ఇవ్వటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చౌక డిపోల నుంచి రేషన్ పంపిణీ వ్యవస్థను జూన్ నెల మొదటి రోజు నుంచి మొదలు పెట్టినప్పటికి బియ్యము చక్కెర మాత్రమే ప్రస్తుతం పంపిణీ జరుగుతోంది. చౌక దుకాణాలలో బయోమెట్రిక్ వేసిన తర్వాత ఏ ఒక్క వినియోగదారికి కూడా బిల్ ఇవ్వడం లేదు. చక్కెరపై అదనపు బాదుడు మరియు తూనికలలో తేడా యదేచ్చగా కొనసాగుతోంది. దీనిపైన అధికారులు ఎవరు స్పందించకపోవడం బాధాకరం. ఆర్భాటపు ప్రకటనలు మాని ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించడంలో చౌక దుకాణాలు విఫలమవుతున్నాయి అని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు తూనికలను పర్యవేక్షిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
