- జిఒ నెంబర్ 51 ప్రతులను దగ్దం
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం: అనంతగిరి మండలంలోని పెదకోటలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన జి ఒ నెంబర్ 51ని రద్దు చేయాలని, ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జి వో పత్రాలను దగ్దం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదివాసుల ప్రత్యేక హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి 5వ షెడ్యూల్ ప్రాంతంలో గల అనంతగిరి మండలం పెదకోట గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అదానీ కంపెనీకి అనుమతులు మంజూరు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
ప్రభుత్వం తక్షణమే అనుమతులు వెనక్కి తీసుకోవాలని, ఏకపక్షంగా, దొడ్డిదారిన తీసుకువచ్చిన జి ఒ నెంబర్ 51 రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్రపరిణామలను ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్ష కార్యదర్శులు,పి.సోమన్న,టి క్రిష్ణరావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి లక్ష్మణరావు. వైస్ ఎంపీపీ ఎస్. కొండలరావు సంఘ నాయకులు పి లింగమూర్తి, కె ఆనంద్ కుమార్ కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు .