- పండుగ పూట రోజు మంచి నీళ్లు కోసం చిన్న ముల్కనూరు గ్రామంలో.. మహిళలు ధర్నా..
- పట్టించుకోని అధికారులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో ఆదివారం మంచినీటి కోసం మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కాలి బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నాలుగో వార్డ్ లో నీళ్లు రాక మూడు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు కార్యదర్శి మంచినీటి సమస్య పై శ్రద్ధ తీసుకొని కాలనీవాసులకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. పండుగ పూట కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందని అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.