అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో భారత్ బంద్ లో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో సిఐటియు విభాగానికి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహము నుండి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక గాంధీ సర్కిల్ వద్ద మానవహారం వేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సిఐటియు మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని, జి ఒ నెంబర్ 36 ను వెంటనే అమలు చేయాలని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని, దేశంలో కార్మికుల నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసుకోవాలని, విద్యుత్తు స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అంగన్వాడి వర్కర్లకు యాప్ ల పేరుతో వేధింపులు వెంటనే ఆపాలని, లేనిచో ధర్నాలతో పోరాటాలు ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ఎఫ్ఐ రమేష్, రామకృష్ణ, అంగన్వాడి, ఆశ వర్కర్లు నాగరత్న, ఉమాదేవి, భారతి, ఓబులమ్మ, నాగలక్ష్మి మున్సిపల్ కార్మికులు రాజు, రామాంజనేయులు, మురళి, చంద్ర శేఖర్, ఆది తదితరులు పాల్గొన్నారు.
