కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వబడదని ఎస్సై జి. నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎస్సై నరేందర్ రెడ్డి, ఈ నెల 12వ తేదీన గన్నేరువరం పరిధిలో ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలకు ముందస్తుగా అనుమతి లేదు అని తెలిపారు. ప్రజలు, నాయకులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా ఏవైనా సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తే సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడటం, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటమే తమ ప్రాధాన్యమని ఎస్సై నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలకు సూచన:
అధికారుల అనుమతి లేకుండా నిర్వహించే ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనరాదని, అలాగే అనుమానాస్పదమైన చర్యలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.