- అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలి
- ఆదివాసి విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మహేశ్వరరావు
పాడేరు న్యూస్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసి విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు తాంగుల మహేశ్వరరావు, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులతో గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణికు మర్యాదపూర్వకంగా కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి పాత్రికేయ వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న ఆదివాసి జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు, అక్రిడేషన్, బస్సు పాస్, నూరు శాతం రాయితీ ఫీజులు, ఆరోగ్య భీమా, వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు, జర్నలిస్టులందరికీ వర్తించే హక్కులు చట్టాలను పరిరక్షించేందుకు ఉన్న జీవోలను అమలు చేయాలన్నారు, గిరిజన ప్రాంతంలో ప్రతి మండల కేంద్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్లు స్థలాలు కల్పించాలని ప్రభుత్వాలు చెబుతున్న నేటికీ అది అమలు కావడం లేదన్నారు, ఎన్ని కాలలో ప్రజలతోపాటు జర్నలిస్టులందరికీ పాలకొల్లు ఇస్తున్న హామీలు బుట్టదాకలవుతుందన్నారు, వృత్తిని నమ్ముకుని జర్నలిస్టుగా ఎన్నో సేవలు అందిస్తున్నారు, వారి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు, సానుకూలంగా స్పందించిన గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం నా వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.