ప్రవాస ఆంధ్రులు, సంపన్నులు P-4లో భాగస్వాములై, సొంత నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించి, పేదలకు మేలు చేయాలని కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ పిలుపునిచ్చారు. గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణంలోని 17వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మరికొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు జరుగుతుంది, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నాం. గత ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజల్లోకి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు తీసుకెళ్లాలని తెలిపారు. 2014- 19లో అభివృద్ధి, సంక్షేమ రెండు అమలు చేసినా చేసింది చెప్పుకోలేక 2019లో నష్టపోయామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత వైసిపి హయంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే పారిశ్రామిక వేత్తలు ఈ ఏడాదిలో రూ.9.34 వేలకోట్ల రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా 8.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని, టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయని తెలిపారు. సంక్షేమంలో సైతం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకు ఏడాదికి 34వేల కోట్లు అవుతుందన్నారు.
ఈ కార్య్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు చౌదరి, రంగస్వామి, రసూల్, చికెన్ సీన, సురేష్ గౌడ్, కొత్తపల్లి శేఖర్; నరసింహ యాదవ్; సుంకయ్య ఎన్టీఆర్, స్టీఫెన్, సుకేంద్ర, నారాయణస్వామి, మరియు 17వ వార్డు బూత్ ఇన్చార్జి మరియు తెలుగుదేశం పార్టీ నాయ
