బొబ్బిలి, విజయనగరం జిల్లా – స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ అభ్యుదయ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో తలపై తీవ్రంగా గాయమై మరణించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థి మృతిపై పలుముఖాలుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణే కారణమా? లేక మరెన్నయిన కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, విద్యార్థి మరణానికి సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇక విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. స్కూల్ యాజమాన్యం ఈ ఘటన పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం కల్పించేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. విద్యార్థి మృతి కేసులో పూర్తి నిజాలు బయటపడాలన్నది సమాజం ఆశ.