మహబూబాబాద్ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మహబూబాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. “ఇంకా ఫీజులు విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అంటూ ఎస్ఎఫ్ఐ నేతలు నినాదాలు చేసారు.
ఈ ఆందోళనకు ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతి బసు, కార్యదర్శి పట్ల మధు నేతృత్వం వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు, ప్రత్యేకంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్ లాంటి ఆర్థిక సాయం నిలిచిపోయిన విషయం పట్ల విద్యార్థుల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నిక్షిప్త, నాయకులు గుండ్ల రాకేష్, కొలిపాక వీరేందర్, పెద్దపులి బాసు, ఉదయ్, పవన్, మహేష్, వరుణ్, వంశీ, యాకన్న తదితరులు పాల్గొన్నారు.