- ఏడు, ఎనిమిది నెలలుగ వేతనాలు ఇవ్వని వైనం
- ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డబ్బింగ్ కళాకారులు
- నాలుగు నెలలుగా సౌండ్ ఇంగీనీర్ల వేతనాలు
- డబ్బింగ్ స్టూడియో కి డబ్బు చెల్లించలేదు
- కొందరైతే పూర్తిగా వేతనాలు చెల్లించకుండ పరారీలో ఉన్నారు
- పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరింపులు
- ప్రశ్నిస్తే రౌడీలను రంగంలోకి దించుతారు
హైదరాబాద్ : రోజు రోజుకి టివి పరిశ్రమలో మోసగాళ్ళకు మోసగాళ్ళు బయటపడుతున్నారు. టీవీ సీరియల్స్ ప్రొడ్యూసర్లు కొందరు కళకారులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. ఏడు ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు టీవీ సీరియల్స్ ప్రొడ్యూసర్లు. మరికొందరైతే ఏకంగా వేతనాలు చెల్లించకుండా గుండాయిజం చేయడం పబ్బం గడుపుకోవడం మరికొందరైతే పరారవుతున్నారు. రెక్కాడితే డొక్కాడని కార్మికుల రక్తం తాగుతూ వేతనాలు చెల్లించకుండ పక్క రాష్ట్రాలకు పరారై రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం.
ప్రముఖ తెలుగు జెమినీ టివి లో ప్రసారమవుతున్న భైరవి సీరియల్ కి సంబంధించిన డబ్బింగ్ కళాకారుల వేతనాలు గత నాలుగు నెలల నుండి చెల్లించక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాక సౌంగ్ ఇంజనీర్ వేతనాలు, డబ్బింగ్ స్టూడియో కి కట్టాల్సి డబ్బు కూడా కట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్మికులు ప్రశ్నిస్తే జెమినీ టీవీ వారు మాకు డబ్బులు ఇవ్వలేదని, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదని ( Manager Shiva : 7019476929) .. కల్లబొల్లి మాటలు చెప్తూ కార్మికుల , కళాకారుల వేతనాలు ఎగ్గొడుతున్నారు.
పొట్ట చేతపట్టుకొని బ్రతుకుదెరువుకోసం తెలంగాణాకి వచ్చిన ఎంతోమంది కళాకారులు, కార్మికులకు వేతనాలు ఇవ్వకుండ మోసం చేస్తుంటే తెలంగాణ కార్మికశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అధికారులకు భారీగానే ముడుపులు అందుతున్నటు తెలుస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.