కరీంనగర్ జిల్లా: ప్రజలు అనేక రోగాలతో సతమతమవుతూ తమ వ్యాధులను తగ్గించుకోవడానికి ఆస్పత్రుల బాట పట్టడం సర్వ సాధారణ మైనది. అయితే ఈ క్రమంలో కొన్ని ప్రధాన నగరాలలోని హాస్పిటల్స్ ఇదే అదునుగా భావించి తమ ఆసుపత్రులకు వచ్చే రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా అక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ రేనే హాస్పటల్ పై పలు ఆరోపణలు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేనే హాస్పటల్ కు 17జూలై 2025వ తేదీన ఓ మహిళ అనారోగ్యం చేసిందని హెల్త్ చెకప్ కు వెళ్లింది. డాక్టరు ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించి పలు రకాల మందులను రాసి ఇచ్చారు. మందులను తీసుకుందామని హాస్పిటల్ లోని మెడికల్ షాపు కి వెళ్ళగా వారు మందులను ఇచ్చారు. వెంటనే ఇంటికి వెళ్లి మందులను వేసుకునే టైంకి వాటిని పరిశీలించగా, నాప్రోయాక్ట్-డి 500 అనే ఔషధం తేడాగా కనబడింది. అది ఏమిటంటే?దాని ఎక్స్పైరీ ని పరిశీలించగా డేట్ అయిపోయి ఉంది గమనించాడు.అంతే కాకుండా రేటు కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ బిల్లు వేశారు. ఈ విషయాలను గమనించిన పేషంట్ ఒక్కసారి కంగుతిన్నది. జిల్లా కేంద్రంలో పేరుగాంచిన హాస్పటల్లో ఇలా జరగడమేమిటని? ఆశ్చర్యానికి గురికావాల్సిన పరిస్థితి ఎదురైన ఆమెకు. ఒకవేళ పై విషయాలను గమనించకుండా టాబ్లెట్లను వేసుకుంటే తన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది.
రేనే హాస్పిటల్, డాక్టర్, మెడికల్ షాప్ నిర్వాహకం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలు తమ వ్యాధులు నయమవుతావని నమ్మకంతో మారుమూల ప్రాంతాల నుండి పెద్దపెద్ద ఆసుపత్రులను ఆశ్రయించగా, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బడా ఆసుపత్రులు ఇలా అక్రమాలకు పాల్పడుతూ, సామాన్య ప్రజల ఆరోగ్యాలతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని జిల్లా జిల్లా కేంద్రంలో చర్చగా మారింది. అసలు ఎక్స్పైరీ అయిన మందులను ఒక ప్రముఖ ఆసుపత్రిలో రోగులకు ఎలా ఇస్తారు? అంతేకాకుండా ఉన్న ఎంఆర్పి కంటే అధిక ధరలు ఎలా వసూలు చేస్తారు.?ఇది డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుందా? లేదా దీని వెనుక ఏమన్నా ముసుగు దందా నడుస్తుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.