నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం లో వరుస చో్రీలు ఎక్కువయ్యాయి..సుమారు 40 మోటార్ల వరకు చోరీకి గురి అయినట్టు రైతులు తెలిపారు.వీటిలోని విలువైన రాగి వైరు, మోటార్ ఆయిల్ చోరీకి గురవుతున్నాయి.ఒక్కొక్క మోటర్ లో సుమారు 40 నుంచి 50 వేల రూపాయలు విలువగలిగిన చోరీతో లక్షలలో రైతులు నష్టపోయారు.దొంగలను స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న వారిని కాపాడేందుకు భారీగా రాజకీయ ఒత్తిళ్లు జరుగుతున్నట్లు సమాచారం.అసలే మెట్ట ప్రాంతం ఉన్న కొద్దిపాటి నీటితో వ్యవసాయం చేసుకునే సమయంలో ఈ మోటార్లు దొంగతనం జరగడం పంటలకు ఎంతో నష్టం కలిగిందని తమకు తగిన న్యాయం చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
