● గన్నేరువరం లో వాడ వాడకు దోమల ఫోగ్గింగ్
● ప్రతి ఇంటింటికి వైద్య పరీక్షలు
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ కాలనీలో విజృంభిస్తున్న విష జ్వరాలు పై వరస కథనాలతో ప్రజల పక్షాన రిపోర్టర్ టీవీ మంగళవారం, బుధవారం ప్రత్యేక కథనాలు ప్రచురించింది.
బుధవారం నాడు గ్రామ సచివాలయం కార్యదర్శి వెంకట రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్సీ బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించగా.. సాయంత్రం కరీంనగర్ నుంచి దోమల ఫోగ్గింగ్ ప్రత్యేకంగా తెప్పించి వాడవాడకు తిప్పారు. దోమల ఫోగ్గింగ్ ప్రతిరోజు సాయంత్రం మూడు రోజులు ఉంటుందని కార్యదర్శి తెలిపారు.
గురువారం ఎస్సీ బీసీ కాలనీ లో పల్లె దవఖాన డాక్టర్. ఉపేందర్ ఆధ్వర్యంలో ఇంటింటికి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 30 కుటుంబాలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. డాక్టర్. ఉపేందర్ మాట్లాడుతూ తీవ్రంగా జ్వరాలు వస్తే పల్లె దవఖాన ను సంప్రదించాలని, వైద్యులు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతిరోజు పల్లె దవఖాన లో అందుబాటులో ఉంటామని అన్నారు. వైద్యులు సూచించిన పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఎస్సీ బీసీ కాలనీవాసులు రిపోర్టర్ టీవీ యాజమాన్యానికి. రిపోర్టర్ టీవీ ప్రతినిధి రాజ్ కోటి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ కార్యదర్శి వెంకటరెడ్డికి కాలినీవాసులు అభినందించారు.