కరీంనగర్ జిల్లా: వీణవంక మండలంలో శ్రీ కనకదుర్గ వైన్స్ షాప్ లో పనిచేస్తున్న మెట్టుపల్లి కి చెందిన గుర్రం దేవరాజు, అన్నారం కి చెందిన పూదరి రతన్, లింగాపూర్ కి చెందిన పచ్చిమట్ల శ్రీనివాస్ లు వైన్స్ షాపు యజమానికి తెలియకుండా నమ్మకద్రోహం చేసి దాదాపు 6 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసి వినియోగించుకున్నారని వైన్స్ షాపు యజమాని మార్క సంపత్ గౌడ్ వీణవంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఆవుల తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
