అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో బెల్ట్ షాపులుపై పోలీసులు దాడులు నిర్వహించి 17 మద్యం బాటిల్స్ స్వాధీనపరచుకొని ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే గ్రామంలో శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి డయల్ 100 సేవలు పొందాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్లు హనుమంతు, నీలకంఠారెడ్డి, ప్రకాష్, భాస్కర్ నాయుడు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
