కరీంనగర్ జిల్లా: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ లో పదవ తరగతి మరియు ఇంటర్ చదువుటకు అడ్మిషన్లు గడువును ఈ నెల 18 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పొడిగించినట్లు గన్నేరువరం స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కె. రామయ్య తెలియజేశారు.
చదువు మధ్యలో మానేసిన వారు, గృహిణులు, వృత్తి పనులు నిర్వహిస్తున్న వారు చదువు కొనసాగించాలని ఆసక్తి ఉన్నవారు చదువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గన్నేరువరం నందు సంప్రదించి అడ్మిషన్లను పొందాలని స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ రామయ్య కోరారు.
ప్రవేశాల కొరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు 9866853143 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.