కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : చింతలమానేపల్లి,డబ్బా గ్రామంలో చాపిడి సోంబాయి 80′ బతికి ఉండగానే చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించడంతో డబ్బా గ్రామ శివారులో 14 సర్వే నెంబర్ 24 గుంటల తన భూమిని మరో వ్యక్తిపై భూమి మార్పిడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని. కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. సబ్ కలెక్టర్ సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించింది. వృద్ధురాలకు సిపిఎం పార్టీ నాయకులు ముంజం ఆనంద్ కుమార్ అండగా నిలిచాడు.
