కరీంనగర్ జిల్లా: వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, పిఓ ఎంసిహెచ్ డాక్టర్ సన జవేరియా తో కలసి పట్టణ ఆరోగ్య కేంద్రము తనఖీ చేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రం యొక్క హాజరు పట్టిక మరియు అసంక్రమిత వ్యాధులైన అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ రోగుల రికార్డులను తనిఖీ చేసి వారికి పంపిణీ చేస్తున్న మందుల వివరాలను పరిశీలించారు పేషంట్లు అందరూ ప్రభుత్వము ఉచితంగా సరపరా చేస్తున్న మందులను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. లేబరేటరీని పరిశీలించి రోగుల రక్త నమూనాలను పరీక్ష నిమిత్తము టీ -హబ్ కి పంపిస్తున్న వివరాల రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్స్ లో మందులను పరిశీలించి ఈ సీజన్లో వచ్చే వ్యాధులకు అనుగుణంగా మందుల నిల్వలను ఉంచుకోవాలన్నారు. తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారము ప్రతి ఇంటింటికి ఫీవర్ సర్వేను చేస్తూ జ్వర పీడితులను గుర్తించి చికిత్స అందించాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తున్న సమయంలో “దోమలను పుట్టనివ్వద్దు-కుట్టనివ్వద్దు” ధ్యేయంగా గృహస్తులకు దోమ లార్వా నివారణ చర్యలపైన అందుకు ప్రతి మంగళవారము మరియు శుక్రవారము డ్రైడే కార్యక్రమాలు నిర్వహించడంపై అవగాహన కలిగించాలన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో పిఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా,పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇమ్రాన్,సూపర్వైజర్ బేగ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
