పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పై రెండవ సంవత్సరం విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు విద్యార్థులు పాల్గొన్నట్లు సమాచారం. వారంతా కలసి విద్యార్థిని బలవంతంగా బీసీ హాస్టల్‌కి తీసుకెళ్లి దారుణంగా కొట్టినట్టు వీడియో లో గమనించవచ్చు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని బాధిత విద్యార్థి కుటుంబం అర్పొస్తుంది. ఈ విషయం పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
ఈ దాడిలో బాలుడు చనిపోతే పరిస్థితి ఏంటి ? ఎవరు బాధ్యత వహిస్తారు. దాడికి పాల్పడిన వారు మైనర్లు కావున చర్యలు తీసుకోము అని పోలీసులు అంటే .. వారి దెబ్బలకు బాలుడు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అనే విషయం కూడా పోలీసులు స్పష్టం చేయాలి. చట్టాలను చూపించి మీడియాని బెదిరించడం కాదు. అతి కిరాతకంగా కొట్టడమే కాకుండా బాధిత బాలుడి పై ఆరోపణలు .. పుకారులు పుట్టిస్తున్నారు కొందరు.. ఇది ఎంతవరకు సరైనదో అధికారులు ఆలోచించాలి.