సూర్యాపేట: నిత్య పెళ్లికొడుకుగా చలామణి అవుతున్న కానిస్టేబుల్ కృష్ణంరాజు వ్యవహారంపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విచారణకు ఆదేశించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పీఎస్ లో పని చేస్తున్న కృష్ణంరాజు వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని… గత ఏడాది సూర్యాపేట మండలానికి చెందిన మైనర్ బాలికతో మూడో వివాహం జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం సదరు బాలిక సూర్యాపేట పట్టణ పరిధిలో ఉంటోంది.
కానిస్టేబుల్ కృష్ణంరాజుపై విచారణ అధికారిగా సీఐ రామకృష్ణారెడ్డిని ఎస్పీ నియమించారు. మరోవైపు గతంలో తిరుమలగిరి పీఎస్ లో పని చేసే సమయంలో ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఆయనను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్ లో డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. మైనర్ ను వివాహం చేసుకోవడంతో ఇతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.