అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం: కొట్నాపల్లి పంచాయితీ,గ్రామ ప్రజలు తమ గ్రామ పరిధిలో జరుగుతున్న క్వారీ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వాటిని తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదమైందని.గ్రామస్థుల ఆరోపణలు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రారంభంలో “3 సంవత్సరాల పాటు మాత్రమే” క్వారీ పనిచేస్తుందని భరోసా ఇచ్చి భూ యజమానుల నుండి సంతకాలు తీసుకున్నారని, కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.తరువాత కాల వ్యవధి 5 సంవత్సరాలు, ఆపై 10 సంవత్సరాల అగ్రిమెంట్గా మారిందని, ఈ ప్రక్రియలో కొంతమంది సంతకాలు దొంగ గా forge చేయబడ్డాయని గ్రామస్థులు తెలిపారు.
క్వారీ ప్రభావం గ్రామస్థులు పేర్కొన్న నష్టాలు: ఆరోగ్య నష్టం: గాలి మరియు శబ్ద కాలుష్యం పెరిగి, పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణులు శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్నారు, బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలకు బీటలు, పగుళ్లు వస్తున్నాయి, భూగర్భజలాల తగ్గుదల, వ్యవసాయ భూముల పాడుబాటు పడుతున్నాయని, అడవి ప్రాంతాలు, జంతు జాతులు నశించడం; చెరువులు, నీటి మూలాలు నాశనం కావడం జరుగుతుంది , సామాజిక నష్టం కలుగుతుందని గ్రామస్థుల ఐక్యత దెబ్బతినడం, అధికార వ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుందని చెప్పారు.
బాధితుల డిమాండ్లు: గ్రామ ప్రజలు స్పష్టంగా తమ డిమాండ్లను మీడియా ద్వారా వెల్లడించారు,క్వారీని శాశ్వతంగా మూసివేయాలి,భూములను మునుపటి స్థితికి తీసుకువచ్చి యజమానులకు అప్పగించాలి,ఆరోగ్య, ఆస్తి నష్టాలకు సరైన నష్ట పరిహారం చెల్లించాలి. దొంగ సంతకాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో గ్రామ అంగీకారం లేకుండా ఏ పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదు,అధికారుల స్పందన గ్రామస్థుల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్, సంబంధిత మైనింగ్ అధికారులు స్పందించాలి, లేనియెడల గ్రామస్థుల పోరాటం మరింత ఉధృతమవుతుందని స్థానిక బాధిత ప్రజలు హెచ్చరించారు