మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ , డివిజన్ సీఐలు మరియు ఎస్సైలతో ఆగస్టు నెల క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూలై నెలలో నమోదైన కొత్త కేసులు, పాత పెండింగ్ కేసులు, ఇంకా పూర్తికాని విచారణలు, అలాగే పెండింగ్‌లో ఉన్న NBWs పై సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం సీసీ కెమెరాల వ్యవస్థాపన, వాటి సక్రమమైన పనితీరు, మరియు భద్రతా చర్యలపై చర్చించారు. అదేవిధంగా అధికారులు వద్ద పెండింగ్‌లో ఉన్న G2, CCC పిటిషన్ల పరిష్కారంపై సూచనలు ఇచ్చారు. రాబోయే లోక్ అదాలత్‌కు సంబంధించిన ఏర్పాట్లు, పరిష్కార చర్యలు, గణేష్ ఉత్సవం సందర్భంగా నిబంధనలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యాల కోసం చేపట్టవలసిన చర్యలపై కూడా ప్రత్యేకంగా అదేశాలు డి.ఎస్.పి జారీ చేశారు










