కరీంనగర్ జిల్లా: లోయర్ మానేరు డ్యామ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళను కరీంనగర్ లేక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మల్యాల రాజేశ్వరి (43) భూ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.ఈ విషయాన్ని గమనించిన లేక్ ఔట్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎం.ఎ. హఫీజ్ బేగ్ వెంటనే అప్రమత్తమై ఆమెను ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమింపజేశారు. అనంతరం ఆమెను లేక్ పోలీస్ ఔట్ పోస్ట్ కు తీసుకువచ్చి, కౌన్సిలింగ్ నిర్వహించారు.
అప్పటికే ఆమెపై చందుర్తి పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు నమోదైనట్లు గుర్తించి, ఆమెను సురక్షితంగా చందుర్తి పోలీసులకు అప్పగించారు. ఆపదలో ఉన్న మహిళను కాపాడిన హోంగార్డు హఫీజ్ బేగ్ ధైర్యసాహసాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.