కరీంనగర్: కరీంనగర్ రూరల్ పరిధిలో ఏసీపీగా జి. విజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ ను తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి, చిగురుమామిడి ఎస్ఐ సాయికృష్ణ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్, భద్రత, చట్ట వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రజల సంక్షేమం కోసం తన సేవలను అంకితం చేస్తానని అన్నారు. ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ రూరల్ ప్రాంతంలో ప్రజల సురక్షితభవనం కోసం ప్రతి దిశలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.