contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బొబ్బిలి కోటలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బొబ్బిలి : స్వాతంత్ర్య పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే కీ॥శే॥ తెంటు జయప్రకాష్  77వ జయంతి పురస్కరించుకొని, వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంతో ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. జెండా వందనంతో మొదలైన వేడుకలు, జయంతి సభతో ముగిశాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :