చిత్తూరు జిల్లా చౌడేపల్లి : మండల కేంద్రమైన చౌడేపల్లి కు చెందిన విజయ వాణి సంస్థల అధినేత నాయిని చంద్రశేఖర్ మూర్తికి ఉత్తమ ప్రశంస అవార్డుతో పాటు జ్ఞాపికను అందజేశారు వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు సమాజ సేవలో ఆయన చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు
చౌడేపల్లి మండలంలో జాతీయ జెండా రెపరెపలాడింది అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు దుకాణాలు కార్యాలయాల వద్ద స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరేసి తమ దేశభక్తిని చాటుకున్నారు ఉదయాన్నే తహసిల్దార్ కార్యాలయంలో పార్వతి ఎంపీడీవో కార్యాలయంలో మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఎంపీడీవో లీలా మాధవి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై నాగేశ్వరరావు బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం సుబ్రహ్మణ్యం తదితర కార్యాలయాలు ప్రైవేటు సంస్థల వద్ద జాతీయ జెండాను ఎగరేసి పిల్లలకు స్వాతంత్ర్య పోరాట సమరయోధులు సమాజంలో మునుగుల ఎలా సాధించాలి అన్న అంశాలపై విద్యార్థులకు తెలియజేశారు ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు