చిత్తూరు జిల్లా చౌడేపల్లి : సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై శనివారం తిరునాళ్లు ప్రారంభమయ్యాయి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన ఉదయం 6 గంటల నుండి స్వామివారికి అభిషేకము, రాజనాల పండుగ వద్ద వీరాంజనేయ స్వామి వారికి అభిషేకము నిర్వహించారు. ఉదయం నుంచి కొండపై సాయంత్రం వరకు భక్తులు నడిచి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు రాత్రి అఖండ జ్యోతిని వెలిగించారు. రాత్రి శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే రాజనాల పండుగపై అన్నమయ్య సంకీర్తనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రాజనాల బండపై పండుగ వాతావరణం నెలకునింది
