పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కరీంతుల్లాబాద్ కు చెందిన పి.మురళి పై చట్టపరమైన చర్యలు తీసుకోని పేదలకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలతో కలిసి స్థానిక నాయకులు డేవిడ్ సురేష్, రావిళ్ళ మోహన్, కె.రాజేంద్ర, రంజిత్, సుబ్బు ఎమ్మార్వో కి మరియు పాకాల సిఐ కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. స్థానిక ప్రజలు, నాయకులు తెలిపిన వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాకాల గ్రామపంచాయతీ కరీంతుల్లాబాద్ కి చెందిన పి.మురళి కొంతకాలంగా గాంధీనగర్, కరీంతుల్లాబాద్, శివాజీ నగర్, శ్రీనివాస్ నగర్ లో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 2904, 2905, 2906, 2828, 2960 లో గల ప్రభుత్వ భూమిని అక్రమంగా చదును చేసి ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నాడన్నారు. ఇతనికి రిజిస్టర్ ఆఫీస్ లో గల మురళి అనే వ్యక్తితో సంబంధాలు కుదుర్చుకొని డాక్యుమెంట్లను మార్పు చేసి ప్రజలకు అమ్ముతున్నారని తెలియజేశారు. అదేవిధంగా పేదల స్థలాలకు దొంగ పట్టాలు సృష్టించి అమ్ముతున్నాడని స్థానిక ప్రజలు ఆరోపించారు. కరీంతుల్లాబాద్, శివాజీ నగర్ లలో ఇప్పటికే చాలా భూములు విక్రయించాడని తెలిపారు. కరీంతుల్లాబాద్ కు చెందిన కుమారు అనే వ్యక్తి అక్కడ ప్రజలకు అంగన్వాడి నిర్మాణం కోసం తన సొంత భూమి ఇచ్చారని, ఆ భూమిని కూడా మురళి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడన్నారు. నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం ఇచ్చిన భూమిని కూడా ఆక్రమించుకొని విక్రయింస్తూనాడన్నారు. ప్రభుత్వ అధికారులు కరీంతుల్లాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని పరిశీలన చేసి ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని అదేవిధంగా పేద ప్రజలను మోసం చేస్తున్న మురళి పై చట్టపరినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
