కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్, మోడల్ స్కూల్ విద్యార్థినిలు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ బాడ్ టచ్ రెస్పాండింగ్ డాల్ ప్రాజెక్టును న అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రూపొందించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పవతి కి ప్రాజెక్టును ప్రదర్శించగా వారు కొన్ని మార్పులను సూచిస్తూ మార్గదర్శనం చేశారు. ప్రాజెక్టులో ముఖ్యంగా వాయిస్ రికార్డింగ్ ద్వారా గుడ్ టచ్ బాడ్ టచ్ కు సంబంధించిన విషయాలన్నింటినీ నిక్షిప్తం చేయాలని, బ్యాడ్ టచ్ చేసిన వారి వివరాలను నమోదు చేసుకునే విధంగా రూపొందించాలని ఆదేశించారు.. పాఠశాల లోని బాలురందరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
ప్రాజెక్టును రూపొందించిన జె. వైష్ణవి,పి అను, గైడ్ టీచర్లు ఎన్.కొండల్ రెడ్డి,పిజిటి, వి.ముక్తి ప్రసాద్, పిజిటి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్ ను కలెక్టర్ ప్రశంసించారు.
