- ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రోజున ఇస్తున్న అవార్డులను ఎందుకని ఈ సంవత్సరం ఇవ్వలేదు
- ఎస్.ఎల్.ఎస్.యమ్.పి.సి లో చెరడమే వాళ్ళకి పాపమా
తిరుపతి: శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నలుగురు కి అవార్డులను శ్వేతా బిల్డింగ్ నందు ప్రధానోత్సవం చేస్తారు. ఎందుకని గత సంవత్సర కాలంగా శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులకు అవార్డులను ప్రధానోత్సవం చేయ్యలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టిటిడి ఉన్నత అధికారులు శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులనీ చిన్నచూపు చూస్తున్నారా. ఎందుకని వారిమీద అంత కక్ష. వారు ఎస్.ఎల్.ఎస్.యమ్.పి.సి లో చెరడమే వాళ్ళు చేసిన పాపమా లేక శాపమా అని లోలోపల కార్పొరేషన్ ఉద్యోగులు మదన పడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఔట్సోర్సింగ్ సొసైటీలు /ఏజెన్సీలో/ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే చర్యలో భాగంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏపీ కార్పొరేషన్ (ఆప్కో)కి అసెంబ్లీలో సపరేట్ బడ్జెట్ పెట్టి ఆమోద ముద్ర వేశారు. దానికి అనుగుణంగా టీటీడీలో గత ప్రభుత్వ పాలకమండలి ఐఏఎస్ లతో కమిటీ వేసి శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ని ఏర్పాటుచేసి అందులోకి టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ సొసైటీలు /ఏజెన్సీలో/ కాంట్రాక్టు ప్రాతిపదిక పైన పనిచేస్తున్నటువంటి దాదాపు 10000 పదివేల మంది ఉద్యోగులకు, ఉద్యోగ భద్రత కల్పించడం కొరకు టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ లో చేరిన ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. పే స్కేలు ఫిక్స్ చేసి వీరికి లడ్డు కార్డు, దర్శనం కార్డు అన్ని సౌకర్యాలు పర్మనెంట్ ఎంప్లాయిస్ కు ఉన్నటువంటి సౌకర్యాలు అన్ని కూడా కల్పించారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా గత పాలకమండలిలో తీర్మానం చేసి తెలియపరిచారు.
ప్రస్తుతం ఉన్న పాలకమండలి శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి నియామకాలూ చేపట్టకూడదని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఇప్పుడు గత సంవత్సర కాలంగా ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చే అవార్డులను కూడా నిలిపివేశారు. దీనిపైన ప్రజా సంఘాలు స్పందిస్తూ టీటిడీ లో పనిచేస్తున్న కార్పొరేషన్ ఉద్యోగుల మీద టిటిడి ఉన్నత అధికారులు మొండివైకరి వీడి గతంలో కార్పొరేషన్ ఉద్యోగులకు ఏవైతే ప్రతి సంవత్సరం వర్తిస్తున్నాయో వాటిని కొనసాగించాలంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, టిటిడి చైర్మన్ మరియు ఈవో స్పందించి చొరవ తీసుకొవాలనీ కార్పొరేషన్ ఉద్యోగులు ప్రజా సంఘాలు కోరుచున్నారు.