తూప్రాన్ డివిజన్, మాసాయిపేట : ఇటీవల మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పలు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకోగా, రహదారులు బేసిక్తిగా మారాయి. దీంతో ప్రజలు రాకపోకలలో తీవ్రంగా ఇరుక్కుపోతున్నారు.
రహదారుల దుస్థితితో పాటు, గ్రామాలలో డ్రైనేజీలలో నిలిచిన నీటి వల్ల దోమల సమస్య తీవ్రంగా పెరిగింది. శుభ్రత లోపంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో విధిదీపాల సమస్యలు కూడా ఉత్పన్నమవడంతో రాత్రి సమయంలో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున మాసాయిపేట మండల తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. పంట నష్టపరిహారం వెంటనే రైతులకు అందించాలన్న డిమాండ్‌తో పాటు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు గృహాలు మంజూరు చేయాలని, రహదారులను అత్యవసరంగా మరమ్మతులు చేయాలని, డ్రైనేజీలకు దోమల మందు పిచికారీ చేయాలని, అలాగే మండలంలో సర్పంచ్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలని బీజేపీ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మోలుగు నాగేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్, శివకుమార్ గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు గోగొండ విఠల్, మండల కార్యవర్గ సభ్యులు ముక్క యాదగిరి, సీనియర్ నాయకులు మంగళి బాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం బాధితులకు వెంటనే సహాయాన్ని అందించాలని, పునరావాస చర్యలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.