భగవన్నామ సంకీర్తన తోనే ముందుకు సాగాలని ప్రముఖ పురాణ పండితుడు అనుంపల్లి భాస్కర రావు సూచించారు.అనంతపురంజిల్లా పామిడి పట్టణం లో డబ్బిదార్ ఫిర్కా పాండురంగస్వామి దేవాలయం లో ఆదివారం జరిగిన సభలో అయన ఉపన్యాసించారు. తిరుమల పాదయాత్ర మహాయజ్ఞం విజయోత్సవ సభలో అయన మాట్లాడుతూ భక్తులు పాదయాత్ర ద్వారా వివిధ అనుభూతులు పొందుతారన్నారు. మాజీ శాసనసభ్యులు కొట్రికే మధుసూదన గుప్తా పాదయాత్ర చేపట్టి భక్తులకు, భగవంతునికి అనుసంధానంగా నిలిచిన భావసర క్షత్రియ భజన మండలి, పాదయాత్ర ఆహ్వాన సంఘాన్ని అభినందించారు.సమావేశమునకు ఆలయ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తూ జైన గురువులు పాదయాత్ర తోనే సాగుతారని అన్నారు. ఆలయ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, సింగల్ విండో అధ్యక్షులు బొల్లు శ్రీనివాసరెడ్డిపాల్గొన్నారు. గత నెల 17నుండీ 13రోజుల పాటు పద్యయాత్రలో పాల్గొన్న భక్తులకు, భోజన దాత లైన మీరా బాయి, మధుసూదన గుప్తా,భజన బృందం మున్నా రావు, మురళీధర రావు, జగదీష్ రావు పాదయాత్ర ఆహ్వాన సంఘం వేణుగోపాల్,, వడ్డే వెంకటరాముడు , ఆలయ కమిటీ సభ్యులు ముకుంద, శేఖర్, రవి ఇతరులను శ్రీవారి చిత్ర పటం, లడ్డు ప్రసాదం తో ఘనంగా సత్కరించారు. సీనియర్ పాత్రకీ్యుడు, అనంతపురం జిల్లా ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షులు కె. నారాయణమూర్తి ని సన్మానిస్తుండగా పెద్దయత్తున భక్తులు హర్షద్వానాలు చేశారు
