చిత్తూరు జిల్లా చౌడేపల్లి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బోయకొండ ఆలయ మాజీ చైర్మన్, దివంగత గువ్వల రామకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు స్థానిక బస్టాండ్ వద్ద తెలుగు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు అనూస్, రాయల్ అర్జున్, మని సింగ్, ఆవుల పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గువ్వల రామకృష్ణారెడ్డి గతం నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగించి, పార్టీ ఆవిర్భావం నుంచి తన తుది శ్వాస విడిచేంతవరకు పార్టీకి భక్తిగా సేవలు అందించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ నిబద్ధతతో పని చేసిన ఆయన ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.
ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో గడ్డం వారి పల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ, ముని వెంకటప్ప కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.