- ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ కి వినతి ప్రత్రం…
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు .తిరుపతి జిల్లా కలెక్టర్ కి వినతి ప్రత్రం సమర్పించారు. తిరుపతి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌళిక సదుపాయాల కొరకు ప్రభుత్వం ఇటీవల మహిళలకు పంపిణీ చేసిన తల్లికివందనం పథకంలో రూ.2 వేలు కట్ చేసుకుని పంపిణీ చేసినమాట వాస్తవం అన్నారు. అయితే ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ఆ నిధులు ఎక్కడా ఇవ్వడం లేదన్నట్టుగా
తెలుస్తోందని, చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో తాగునీటి ఇబ్బందులు వల్ల కాలేజీ పిల్లలు నిత్యం వాటర్ క్యాన్లను మోసుకుని వెళ్లే పరిస్థితి దానికి ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు. అలాగే కాలేజీలతో పాటు పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిగా లేక పోవడం, తలుపులు విరిగిపోయి వుండటం, మరుగుదొడ్లు పాచిపట్టి అంటు వ్యాధులు ప్రబలే విధంగా కనిపిస్తుండటం మా పరిశీలనలో తేలిందని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే విద్యాసంస్థల పరిస్థితి ఇలా ఉంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల నిర్వహణ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తెస్తామన్న భయంతోనే ప్రభుత్వం విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలను నిషేదిస్తూ జీ.ఓ తెచ్చిందని, సమస్యలను ఎత్తి చూపినపుడు పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి మంచి జరుగుతుందని, అలా కాకుండా నియంత పాలనతో చీకటి జీ.ఓలు తెస్తే కాలగర్భంలో కలసిపోక తప్పదన్నారు. జిల్లా పరిపాలన అధికారిగా తమరు ఈ దుర్భర పరిస్థితులను గమనించి విద్యాసంస్థల్లో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గo విద్యార్థి విభాగం అధ్యక్షులు చెంగల్ రెడ్డి మండల అధ్యక్షులు గూడూరు రఫీ, యశ్వంత్ రెడ్డి, హరీష్, చిత్తూర్ జిల్లా కార్యవర్గం సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, నరేశ్, ప్రదీప్ కుమార్, శేష రెడ్డి తదితరులు పాల్గొన్నారు.