ఆంధ్రప్రదేశ్ – ఈ రోజున బాపట్ల పట్టణం 32వ వార్డు నరాల శెట్టి వారి పాలెం లో గల రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం వారు ఏర్పాటుచేసిన మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడిబీఏ అడ్వైజర్ మేజర్ జనరల్ రాజేందర్ పాల్ సింగ్ (విఎస్ఎం) ఆర్మీ రిటైర్డ్ అధికారి మరియు ఆయన సతీమణి అవన్నీత్ కౌర్ లు ముఖ్య అతిథులుగా ఆహ్వానితులయ్యారు. అతిథులుగా విచ్చేసిన వారిని రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనంగా శాలువా మరియు పుష్పగుచ్చముతో సన్మానించారు. ఈ సమావేశానికి రాష్ట్ర లీగ్ కార్యదర్శి షేక్ కాలేష అధ్యక్షత వహించారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలను గుర్తించి తమ ధనాన్ని భద్రంగా కాపాడుకోవాలని అతిథి సింగ్ హెచ్చరించారు. కొంతమంది మాజీ సైనికులు సోషల్ మీడియా ద్వారా మరియు ఇంటర్నెట్ ద్వారా వచ్చే ప్రకటనలను నమ్మి తమ బ్యాంకులో ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటున్నారని ఎవరు అజ్ఞానంగా ఉండకూడదని ఇంటర్నెట్లో సైబర్ మోసగాళ్లు చేస్తున్న మోసాలను గురించి సింగ్ వివరించారు. ఈ మోడ్, ఫిక్స్డ్, డిఎస్పి, పిఏఐ, సేవింగ్స్ మొదలగు అంశాలతో కూడిన విషయాలను మాజీ సైనికులకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర లీగ్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ ముఖ్య అతిథులకు ఎల్సిడి మానిటర్ ద్వారా మాజీ సైనికుల సమస్యలు రాష్ట్ర లీగ్ వారు అందించిన సేవలు మరియు చేసిన డాక్యుమెంటేషన్ కరస్పాండెన్స్ చూపిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. మాజీ సైనికుల సంక్షేమంలో రాష్ట్ర సైనిక్ బోర్డ్ మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయము లతో రాష్ట్ర లీగ్ అందిస్తున్న సేవలను వరప్రసాద్ వివరించారు. మాజీ సైనికులు విన్నవించిన సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తూ త్వరలో పరిష్కరించబడతాయని హామీ ఇచ్చారు. అధిక శాతం లో మాజీ సైనికులు మరియు వితంతువులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి సమస్యలకు పరిష్కారంతో కూడిన సమాధానాలు అందించారు. అవన్నీత్ కౌర్ స్త్రీల సమస్యలను తెలుసుకుని పరిష్కారంతో కూడిన సలహాలు అందించారు. బాపట్ల మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వర్ల ఆనందబాబు మరియు ఎకౌంటు మేనేజర్ కార్యక్రమానికి ఆహ్వానితులయ్యారు. పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ గురించి వివరాలు అందించారు. మాజీ సైనికులతో విషయాలను చర్చించారు. విలువైన సమాచారం అందించినందుకు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులకు మాజీ సైనికులు మరియు వితంతువులు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరవీర సైనికుల స్థూపానికి అతిధులు పూలతో నివాళులర్పించారు. రాష్ట్ర పరంగా సేవలందించిన వరప్రసాద్ ను అతిధులు అభినందించారు. ఈ సమావేశము నందు రాష్ట్ర లీగ్ కోశాధికారి షేక్ కలిషా, వసంతరావు, నాగరాజు, కోటేశ్వరరావు, అఖిల్, వంశీకృష్ణ, జిల్లా మరియు రాష్ట్ర లీగ్ సభ్యులైన మాజీ సైనికులు వితంతువులు అధిక శాతం లో పాల్గొన్నారు.
